Tuesday, September 2, 2025
spot_img
HomeSouth ZoneTelanganaజీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే క్రమశిక్షణ, కఠోర శ్రమతోనే సాధ్యం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్

జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే క్రమశిక్షణ, కఠోర శ్రమతోనే సాధ్యం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్

సికింద్రాబాద్:  జింఖానా గ్రౌండ్స్ లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరిధి 69 వ స్కూల్ గేమ్స్ (కబడ్డీ ,ఖోఖో)ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సోమవారం ప్రారంభించారు. అనంతరం విద్యార్ధినీ, విద్యార్ధులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడల ఆవశ్యకతను వివరించి, జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే క్రమశిక్షణ, కఠోర శ్రమ చాలా అవసరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని, స్పోర్ట్స్ యూనివర్సిటీని నెలకొల్పి పిల్లలలో క్రీడా నైపుణ్యాలను పెంపొందించడానికి కృషి చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి  క్రీడలకు బడ్జెట్లో కూడా అధిక నిధులు కేటాయించేలా చేశారని, 2036వ సంవత్సరంలో నిర్వహించనున్న ఒలంపిక్ క్రీడలలో 2 ఈవెంట్లను తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని, విద్యార్థినీ విద్యార్థులు కూడా ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని ఆసరాగా చేసుకుని విద్యతోపాటు క్రీడలలో కూడా రాణించి దేశంలో తెలంగాణ కీర్తి పతాకను ఎగరవేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రియదర్శిని, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ సుధాకర్, డిప్యూటీ డిఇఓ గుండప్ప, ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ప్రసన్న, మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

   Sidhumaroju

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments