మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో కాలనీల మరియు అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన గణనాథులని దర్శించుకున్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ . ఈ సందర్భంగా అయన మండపాలలో గణనాథులకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా.. మాట్లాడుతూ ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని వేడుకున్నారు. అనంతరం బౌరంపేట్ లోని హనుమాన్ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ విష్ణు వర్ధన్ రెడ్డి, ప్యాక్స్ డైరెక్టర్లు అర్కల జీతయ్య, సర్గారి భీమ్, దుండిగల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ షామీర్పేట్ రంగయ్య, సీనియర్ నాయకులు ధర్మా రెడ్డి, వార్డు ప్రెసిడెంట్ జీవన్ రెడ్డి, నాయకులు బైండ్ల గోపాల్, సునీల్, మహేందర్ నాయక్, మహేష్ నాయక్, రోషన్ నాయక్, మరియు స్థానిక నాయకులు, యువకులు. అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Sidhumaroju