హైదరాబాద్: ఎమ్మెల్సీ కవితపై బిఆర్ఎస్ అధిష్టానం వేటు వేసిన అంశంపై మాజీమంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు.బోయిన్ పల్లి శ్రీ వెంకటేశ్వర లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన గణనాథుడి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.బిఅర్ఎస్ పార్టీని ధిక్కరించిన కవితపై వేటు వేయడం సరైన నిర్ణయమేనని అన్నారు. కేసిఆర్ కు కొడుకు, కూతురు ముఖ్యం కాదని పార్టీయే ముఖ్యమని అన్నారు.బిఆర్ఎస్ పార్టీని ధిక్కరించే వారికి ఇదే గతి పడుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి సస్పెన్షన్లు ప్రతి పార్టీలో జరిగాయని, ప్రతి కుటుంబంలోనూ గొడవలు ఉండడం సహజమని తెలిపారు.కాలేశ్వరం విషయంలో సిబిఐ కాదు ఎవరు ఏమి చేయలేరని, కెసిఆర్ లాంటి గొప్ప వ్యక్తి తెలంగాణకు నాయకుడిగా ఉండడం మనందరి అదృష్టమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాలేశ్వరం కూలిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కాలేశ్వరం లాంటి బహుళార్థసాధక ప్రాజెక్టులను నిర్మించిన ఘనత కేసిఆర్ కే దక్కిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశంపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ డ్రామాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
– sidhumaroju