అంగన్వాడీలు పోరాటాలకు సిద్ధం కావాలి,….
(ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్)
అంగన్వాడి కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు పి నిర్మల అన్నారు,, కోడుమూరు అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ కమిటీ మహాసభ గూడూరు లోని వాసవి కళ్యాణ మండపంలో యూనియన్ నాయకులు అనంతమ్మ, సుజాత, రత్నమ్మ, సూలమ్మల అధ్యక్షతన జరిగింది,,, ఈ సందర్భంగా జిల్లా గౌరవ అధ్యక్షురాలు పి,నిర్మల మాట్లాడుతూ,,,, గత ప్రభుత్వ కాలంలో దాదాపు రెండు 42 రోజులపాటు అంగన్వాడి కార్మికులు సమ్మె చేసిన నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం హామీలు కూడా ఇవ్వలేకపోయాడన్నారు,, సమ్మె సందర్భంగా ప్రస్తుత కూటమి నాయకులు అంగన్వాడీల సమ్మె శిబిరాల దగ్గరకు వచ్చి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇచ్చారని, కూటమి ప్రభావం అధికారంలోకి వచ్చి 16 నెలలు దాటుతున్న అంగన్వాడీల సమస్యలు పరిష్కరించలేకపోవడం సిగ్గుచేటని, సమస్యలు పరిష్కరించకపోగా అంగన్వాడీలను రకరకాల యాప్లు తెచ్చి పనిభారాన్ని పెంచిందని, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఐసిడిఎస్ కు నిధులు ఇవ్వకుండా చేతులు దులుపుకున్నదని, దేశంలోని సంపదను అంబానీ అదా నీలాంటి కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికి కార్మికులు సాధించుకున్న 44 రకాల చట్టాలను మార్పు చేసి నాలుగు లేబర్ కోడ్ లను చేయడానికి పూనుకున్నదని,, లేబర్ కోడ్ ల రద్దు కోసం, అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ లందరూ పోరాటాలకు సిద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు