అన్నదాత పోరు” పోస్టర్ ను మాజీ కుడా చైర్మన్ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కోడుమూరు నియోజవర్గ వైయస్సార్సీపి ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ కర్నూలు వారి కార్యాలయం నందు పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి “అన్నదాత పోరు” పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది.అనంతరం వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ నెల 9వ తారీఖున.. కర్నూలు చిన్న పార్క్ నుండి ఆర్డీవో ఆఫీస్ వరకు రైతులతో కలిసి ర్యాలీగా వెళ్లి ఆర్డిఓ కు వినతిపత్రం అందజేయడం జరుగుతుంది. రాష్ట్రంలో యూరియా కోసం, ఎరువుల కోసం రైతులు గత కొన్ని నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం మొద్దునిద్రపోతోంది. ఆ సమస్యలను రైతులతో కలిసి అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో 9న రాష్ట్రవ్యాప్తంగా ఆర్డీఓలకు వినతిపత్రాలిచ్చే కార్యక్రమం చేపట్టాం.రైతులు సంక్షోభంలో ఉంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు గానీ, వ్యవసాయ మంత్రిగా అచ్చెన్నాయుడుకు గానీ ఏ మాత్రం చీమకుట్టినట్టయినా లేదు. రైతులు క్యూలో నిలబడితే దాన్ని బఫే భోజనంతో పోల్చిన అచ్చెన్నాయుడు అసలు మంత్రి పదవిలో కొనసాగేందుకు అర్హుడేనా? రైతులు ఇబ్బందులు ఉంటే ఆయనకు భోజనం గుర్తుకు రావడం దౌర్భాగ్యం.చేసిన తప్పిదాలకు లెంపలేసుకుని రైతులకు క్షమాపణలు చెప్పాల్సింది పోయి, కష్టాలు వారిపట్ల మానవత్వం చూపించాల్సింది పోయి.. ఇంకా అవమానపర చడం దారుణం. రాష్ట్రానికి వచ్చిన ఎరువుల్లో అధికభాగం ప్రైవేటుకు మళ్లించడం వల్లే ఈ సమస్య వచ్చిందని అచ్చెన్నాయుడే స్వయంగా చెప్పాడు.సహజంగా రాష్ట్రానికి కేటాయించిన ఎరువులను 50 శాతం ప్రభుత్వం ఆధీనంలోని మార్క్ ఫెడ్ కు 50 శాతం ప్రైవేటుకు కేటాయిస్తారు. ఈ ఎరువులను మార్కెట్ యార్డుల ద్వారా, పీఏసీఎస్ లు, ఎఫ్పీఓల ద్వారా పంపిణీ చేస్తారు. ప్రైవేటుకు కేటాయించన ఎరువులను ప్రైవేటు దుకాణాల ద్వారా రైతులకు పంపిణీచేస్తారు. పద్ధతి ప్రకారం ఇలా జరగుతుంది.