అన్ని మున్సిపాలిటీ లలో గ్రామ సచివాలయం లోన నల్ల బ్యాడ్జి ల తోన సచివాలయం ఉద్యోగులము నిరసన తెల్పుత్తున్నము. విషయం ఏమిటంటే వార్డు సచివాలయం ఉద్యోగులకు క్లస్టర్ మ్యాపింగ్ అనేది కొత్తగా తీసుకొచ్చారు. ఒక సచివాలయం ఉద్యోగి కి రెండు,మూడు క్లస్టర్ అసైన్డ్ చేయడం వల్లన ఆ క్లస్టర్ లో వాలంటీర్ చేయాల్సిన విధులన్నీ ఆ సచివాలయం ఉద్యోగి చేయాల్సి వస్తుంది.దీన్ని పూర్తి గా సచివాలయం ఉద్యోగులు అందరూ ఖండిస్తున్నాము.ఈ భావన ఎలా ఉంది అంటే సచివాలయం ఉద్యోగులు అందరిని ఒక పెద్ద వాలంటీర్ గా తయారు చేసే విధంగా ఉంది దీన్ని అందరూ ఖండిస్తున్నారు.రకరకాల సర్వే లతో మభ్య పెడ్తున్నారు.సచివాలయం ఉద్యుగుల సమస్యలను పరిష్కరించాలని అని గూడూరు నగర పంచాయతీ సచివాలయం ఉద్యోగి హేమంత్ చెప్పడం జరిగినది.