మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: గత నెల 31వ తేదీన బెంగళూరులో నిర్వహించిన సౌత్ ఇండియా జోనల్ కరాటే ఛాంపియన్‌షిప్ 2025 పోటీల్లో అండర్-18 విభాగంలో మెడల్స్ సాధించిన మల్కాజ్గిరి చిన్నారులను, ఈరోజు స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.
కరాటే కోచ్ శివ మార్గదర్శకత్వంలో, బిఆర్ఎస్ నాయకులు భాగ్యనంద్ రావు,శివ శంకర్ గార్ల ఆధ్వర్యంలో మెడల్స్ సాధించిన విద్యార్థులను అభినందించారు.
గోల్డ్ మెడల్స్ విజేతలు: సహస్ర, అభిలాష్
సిల్వర్ మెడల్స్ విజేతలు: రిషిత, రితీష్, అద్విత్, వైష్ణవి, శ్రీనిక, శ్రీనికేత్, దిశ, తన్వి
బ్రాంచ్ మెడల్స్ విజేతలు:
దక్ష్ ,నక్ష్, ఆశిష్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “కరాటే వంటి ఆత్మరక్షణ కళలు పిల్లల్లో నైపుణ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. ఇటువంటి పోటీల్లో విజయం సాధించడం గొప్ప గౌరవం. ఈ ప్రతిభను మరింతగా మెరిపించే దిశగా చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు. అలాగే, ఈ విజయాల వెనుక నిలబడి ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను మరియు కోచ్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
Sidhumaroju