Home South Zone Telangana ప్రజా సమస్యల పరిష్కారం కోసమే “కంటోన్మెంట్ వాణి” ఎమ్మెల్యే శ్రీ గణేష్

ప్రజా సమస్యల పరిష్కారం కోసమే “కంటోన్మెంట్ వాణి” ఎమ్మెల్యే శ్రీ గణేష్

0

సికింద్రాబాద్ :  ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు మెరుగైన సేవలను అందించేందుకు కంటోన్మెంట్ వాణి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. బోయిన్ పల్లి కాంటోన్మెంట్ ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని అన్నారు. కంటోన్మెంట్ లోని ఒకటవ వార్డులో ఏర్పాటుచేసిన కంటోన్మెంట్ వాణి లో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను స్వీకరించిన వివిధ శాఖలకు చెందిన అధికారులు వీలైనంత త్వరగా పరిష్కారం చూసే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ శాసనసభ్యుడు శ్రీ గణేష్, సీఈవో మధుకర్ నాయక్ తో పాటు రెవెన్యూ, పోలీసు, వాటర్ వర్క్స్, ఇంజనీరింగ్, శానిటేషన్, ఆరోగ్యశాఖ అధికారులకు ప్రజలు దరఖాస్తులు అందించారు. ప్రజల నుండి దరఖాస్తులు తీసుకున్న అనంతరం సమస్యలు పరిష్కరించే విధంగా సత్వర చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ ప్రజల నుండి వచ్చే విజ్ఞప్తులను దరఖాస్తులను తీసుకుని వాటిని పరిష్కరించే క్రమంలో కంటోన్మెంట్ బోర్డ్ ఎజెండాలో పెట్టనున్నట్లు తెలిపారు. సమస్యలకు అనుగుణంగా నిధులను తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అన్ని శాఖల అధికారులకు ప్రజలు దరఖాస్తులు అందిస్తే వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు.

Sidhumaroju

Exit mobile version