Friday, September 12, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshగూడూరు నగర పంచాయతీ నందు ఇటు ఈద్గా నగర్..అటు సింగనిగేరి. తెలుగు వీధి శాంతినగర్ కాలనీ....

గూడూరు నగర పంచాయతీ నందు ఇటు ఈద్గా నగర్..అటు సింగనిగేరి. తెలుగు వీధి శాంతినగర్ కాలనీ. లో. భారీ వర్షం – ఇళ్లలో కి నీరు

ఇటు ఈద్గా నగర్..అటు సింగనిగేరి. తెలుగు వీధి శాంతినగర్ కాలనీ. లో. భారీ వర్షం – ఇళ్లలో కి నీరు చేరడంతో అవస్థలు పడుతున్న ప్రజలు .ఈద్గా నగర్ గత 30 సంవత్సరాలుగా సరైన డ్రైనేజీలు లేక సిసి రోడ్లు లేక వర్షం వస్తే చాలు ఇళ్లల్లోకి నీరు చేరుతాయి ఎన్నిసార్లు చెప్పినా అర్జీలు ఇచ్చిన అర్జీలు చెత్త కుప్పల్లో చేరాయి ఇటు చైర్మన్ అటు కమిషనర్ పట్టించుకునే నాధుడు లేకపాయే …ఈద్గానగర్ లో ఇద్దరూ కౌన్సిలర్లు..ఒకరు చైర్మన్ అయినా ఆ వీధి ప్రజలకు లాభం లేకపాయె 

 10 సంవత్సరాల ముందు ఈద్గా నగర్ లో సిసి రోడ్డుకి కంకర వేశారు రోడ్లు వేస్తారని ఆశ పడిన ప్రజలు చివరికి నిరాశే మిగిలింది సరైన డ్రైనేజీలు లేక సి సి రోడ్లు లేక ఈద్గానగర్..తెలుగు వీధి శాంతినగర్ కాలనీలో మరి దారుణం మారింది గత పది సంవత్సరాల నుంచి అవస్థలు పడుతున్నారు ఈనాటికైనా అధికారుల మనసు కరగలేదు ఇకనైనా అధికారులు స్పందించి సరైన రోడ్లు వేస్తారో లేదో ప్రజలకు అర్థం కావడం అర్థం కావడం లేదంటూ సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి జే మోహన్. సిపిఎం బృందం మాట్లాడుతూ. ఇంటి పన్నులు కులాయి పను వేలకొద్దీ వసూలు చేస్తారు రోడ్లు కాలువలు వేయడం మరిచారు …ఈద్గానగర్ కి డ్రైనేజీ కాలువలు సిసి రోడ్డు కి మోక్షం ఎప్పుడు లభిస్తుంది అని ప్రజలు.సతమతమవుతున్నారు

ప్రభుత్వ అధికార మరియు ప్రజాప్రతినిధులకు మనవి కురిసిన భారీ వర్షాల వల్ల పొలాల్లో కోతకు గురై భారీ పంట నష్టాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఈద్గానగర్.. సింగన గేరి బీసీ కాలనీ ఎస్సీ కాలనీలో ఇళ్లల్లోకి మరియు పూరి గుడిసెల్లోకి వరద నీళ్లు వచ్చి చేరడంతో ఆహార ధాన్యాలు పూర్తిగా తడిసిపోయి నిరాశ్రయులైనారు ప్రభుత్వ అధికార పాలకవర్గం వారు స్పందించి వారిని ఆదుకోవాలని కోరుతున్నాము ఈ పరిస్థితులు మేము స్వయంగా పరిశీలించి మీ దృష్టికి తెస్తున్నాం దయచేసి ఆదుకోగలరు

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments