Home South Zone Telangana పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

0

సనత్ నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్‌లోని మోండా డివిజన్‌లో పర్యటించి, రూ. 1.34 కోట్ల వ్యయంతో మూడు కొత్త సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

బండిమెట్, జైన్ టెంపుల్ సమీపం, మరియు రాజేశ్వరి థియేటర్ వెనుక భాగంలో ఈ రోడ్లు నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్ల సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటిని వెంటనే తొలగించాలని ఆయన అధికారులను ఆదేశించారు. గతంలో ఈ ప్రాంతంలో డ్రైనేజీ, రోడ్ల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించామని, ఇప్పుడు నూతన రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని తలసాని తెలిపారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపించిందని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version