సికింద్రాబాద్ : వైఎంసిఏ లో నూతనంగా నిర్మించిన ఆడిటోరియం, గెస్ట్ రూమ్ లను మంత్రులు అట్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి లు ప్రారంభించారు. అనంతరం అంతర్జాతీయ ఇంటిగ్రేటెడ్ ఎక్సలెన్స్ సెంటర్ కు శంకుస్థాపన చేశారు. వై ఎం సి ఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రశంసించారు.
సేవా మార్గంలో సికింద్రాబాద్ వైఎంసిఏ ముందుకు సాగుతుండటం మంచి పరిణామమని అన్నారు. సికింద్రాబాద్ ప్రాంతం వాసులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. వై ఎం సి ఏ నారాయణగూడలో సైతం అనాధ పిల్లలకు విద్యాభ్యాసం అందించడంతోపాటు నర్సింగ్ కళాశాలను కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ వైఎంసిఏ తో చిన్ననాటి నుండి తమకు జ్ఞాపకాలు ఉన్నాయని అన్నారు.
Sidhumaroju