దాడిలు చేసిన ఈగల్ టీం. భారీగా ఆల్ఫాజోలం పట్టివేత
సికింద్రాబాద్ కంటోన్మెంట్: బోయిన్ పల్లి పిఎస్ పరిధిలోని మూతపడిన మేధా పాఠశాలలో ఈగల్ టీం అధికారులు దాడులు నిర్వహించారు. పక్క సమాచారం మేరకు దాడులు నిర్వహించిన ఈగల్ టీంకు పాఠశాలలో ఆల్ఫాజోరం తయారు చేసే యంత్రాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
దాడిలో దొరికిన అల్పాజోలం విలువ మార్కెట్లోసుమారు కోటి రూపాయలు ఉంటుందని అంచనా. పాత స్కూలు భవనంలో మత్తు పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించిన ఈగల్ టీం వారిని విచారిస్తున్నారు. గత కొంతకాలంగా మూతపడిన పాఠశాలలోనే అక్రమంగా మత్తు పదార్థాలను తయారు చేస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించారు.
Sidhumaroju