రాజమహేంద్రవరం సిటి స్పెషల్ మెునిసిపల్ కార్పొరేషన్ హై స్కూల్‌కు చెందిన విద్యార్థులు జి. అభిరామ్ చరణ్ మరియు హర్ష కుమార్ రాష్ట్రస్థాయి #YogaCompetition (School Games Under-19 Category)లో పాల్గొనడానికి ఎంపికయ్యారు. జిల్లా స్థాయి #SchoolGames లో ప్రతిభ కనబరచిన ఈ విద్యార్థులు ఇప్పుడు రాష్ట్రస్థాయిలో తమ ప్రతిభను నిరూపించుకోబోతున్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈ.వి. సత్యనారాయణ మాట్లాడుతూ, ఇది విద్యార్థుల కృషి మరియు క్రమశిక్షణకు ప్రతిఫలమని పేర్కొన్నారు. ఈ ఎంపిక రాజమహేంద్రవరం #Students ప్రతిభను వెలుగులోకి తెచ్చిందని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం పాఠశాల విద్యార్థులు ఈ విజయంతో #Rajamahendravaram పేరు మరింత ప్రతిష్టత సాధించారు.