ఐజి విగ్రహం నుండి ఐస్ ఫ్యాక్టరీ వరకు 100 అడుగుల రహదారి నిర్మాణం.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్. బీఆర్‌ఎస్ నాయకుడు ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ కాలనీల ప్రతినిధులు ఈరోజు స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ని కలిసి వినతిపత్రం సమర్పించారు.
ప్రతినిధులు మాట్లాడుతూ, “ఐజీ విగ్రహం నుండి ఐస్ ఫ్యాక్టరీ వరకు 100 అడుగుల రహదారి నిర్మాణం అత్యవసరం. రహదారి మధ్యలో డివైడర్ ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ సమస్యలు తగ్గి, ప్రమాదాలను నివారించి, ప్రజలకు రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారుతాయి. అభివృద్ధి చెందుతున్న కాలనీల అవసరాల దృష్ట్యా ఈ పనులను తక్షణం ప్రారంభించాలి” అని విజ్ఞప్తి చేశారు.
ప్రజల విన్నపాన్ని శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే వెంటనే స్పందించారు. తాత్కాలికంగా ఏర్పడిన గుంతల సమస్యపై అధికారులను అక్కడికక్కడే ఫోన్‌లో ఆదేశించి, ప్యాచ్‌వర్క్ పనులు తక్షణం చేపట్టాలని చెప్పడం స్థానికుల్లో సంతోషాన్ని రేకెత్తించింది. అదేవిధంగా, 100 అడుగుల రహదారి విస్తరణకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి త్వరలోనే చర్యలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో MES కాలనీ, వజ్రా ఎంక్లేవ్, సాయి సూర్య, రాయల్ ఎంక్లేవ్ కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
#sidhumaroju