అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 15-16 తేదీల్లో నాలుగో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ శాఖల పనితీరు, సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పాలనలో పారదర్శకత వంటి అంశాలపై సమీక్ష జరుగుతోంది.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పరిశ్రమలు, డిజిటల్ పాలన రంగాల్లో తమ నివేదికలను సమర్పిస్తున్నారు.
సంక్షేమ పథకాల వేగవంతమైన అమలు, ప్రాజెక్టుల పురోగతిపై సీఎం ప్రత్యేక దిశానిర్దేశం ఇవ్వనున్నారు. పాలనలో సమర్థత, ఫలితాలపై దృష్టి కేంద్రీకరించడం ఈ కాన్ఫరెన్స్ లక్ష్యం.