హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం ‘Films in Telangana’ అనే ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభిస్తోంది.
ఈ సింగిల్-విండో సిస్టమ్ ద్వారా రాష్ట్రంలో సినిమాలు రూపొందించడం, సినిమా థియేటర్ల ఆపరేషన్, ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధి అనుమతులు సులభంగా పొందవచ్చు.
వర్క్‌షాప్‌లో తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, MD CH ప్రియాంకా, టూరిజం కార్పొరేషన్ MD వల్లూరు క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
ఈ వెబ్‌సైట్ ద్వారా సినిమా అనుమతులు త్వరగా, సులభంగా పొందగలరో పోలీస్, ఫిల్మ్ శాఖల సహకారంతో వివరించారు.