మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : లాలాపేట్ : తెలంగాణ ఓపెన్ చిల్డ్రన్స్ చెస్ టోర్ననెట్ 2025 గ్రాడ్ ఫైనల్ కి ముఖ్య అతిధిగా బీజేపీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, మాజీ మేయర్ బండా కార్తీకరెడ్డి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం లాలాపేట్ లోని కార్తీక గ్రాండ్స్ ఫంక్షన్ హాల్ జరిగింది. ఈ కార్య క్రమంలో 360 విద్యార్థులు పాల్గొన్నారు. గెలిచిన వాళ్లకు బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో లో బీజేపీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, మాజీ మేయర్ బండా కార్తీకరెడ్డి మాట్లాడుతూ… క్రీడల్లో విద్యార్థులు తమ ప్రతిభను మరింత చాటుకుకోవాలి అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీట వేసింది అన్నారు.
యువత క్రీడల్లో రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తుంది. ఒకవైపు క్రీడా అసోసియేషన్స్ సైతం టోర్నమెంట్లు నిర్వహిస్తూ యువతను ప్రోత్సహిస్తున్నాయి. చదరంగం ఆట అంటే విజ్ఞానం, పరిజ్ఞానం, వ్యూహాత్మకత, కళా నైపుణ్యం కలిసి ఉంటాయి. ఈ ఆట ఆడడం ద్వారా మేధాశక్తితో పాటు ఏకాగ్రత పెరుగుందుదన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్సీఎ సెక్రటరీ జయచంద్ర, నిషా విద్యార్థి అసిటెంట్ డైరెక్టర్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆర్గనైజర్ శ్రీరామ్, చంద్రమౌళి, సంజయ్, బిజెపి నాయకులు వెంకటేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Sidhumaroju