రాష్ట్రంలో కొనసాగుతున్న ఎరువుల కొరత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అదనంగా 40,000 టన్నుల యూరియాను మంజూరు చేసింది.
ఇప్పటికే ఉన్న కేటాయింపుతో కలిపి ఈ నెల మొత్తం యూరియా సరఫరా 1,04,000 టన్నులకు చేరుకుంది.
ఈ నిర్ణయం వలన వరి, మక్కజొన్న, పత్తి వంటి ప్రధాన పంటలకు అవసరమైన ఎరువుల కొరత కొంతవరకు తగ్గనుందని అధికారులు తెలిపారు.
రైతులు సకాలంలో ఎరువులు అందుకోవడం పంటల పెరుగుదలకు, దిగుబడుల పెంపుకు ఎంతో కీలకమని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.