ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున దుమారం రేపిన లిక్కర్ కుంభకోణం కేసులో కొత్త మలుపు తిప్పింది.
ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తాజాగా దాఖలు చేసిన చార్జిషీట్లో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు పొందుపరిచింది.
ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ కేసులో విచారణను ఎదుర్కొంటుండగా, చెవిరెడ్డి పేరు చేరడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. SIT అధికారులు కొత్త ఆధారాల ఆధారంగా ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం.