తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ‘విమోచన దినోత్సవం’ను ఘనంగా నిర్వహిస్తోంది.
సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ఈ వేడుకలకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజా పాలన దినోత్సవం’ జరుపుకుంటుండగా, కేంద్రం మాత్రం అదే తేదీన ‘విమోచన దినోత్సవం’గా వేడుకలు నిర్వహిస్తోంది.
ఒకే తేదీని వేర్వేరు పేర్లతో, థీమ్‌లతో జరుపుకోవడం రాజకీయ పార్టీల మధ్య ఉన్న విభేదాలను సూచిస్తోంది.