హైదరాబాద్: సికింద్రాబాద్ లో నూతనంగా నిర్మించిన మెడికవర్ ఆసుపత్రిని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ లు లాంఛనంగా ప్రారంభించారు.
అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన చికిత్సను అందిస్తూ మెడికవర్ ఆస్పత్రి పేదలకు సేవలు అందిస్తున్నట్లు ప్రముఖులు తెలిపారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో వైద్యవృత్తి అనేది అత్యంత పవిత్రమైనదని, వైద్యులు అందించే వైద్యంతో వేలాదిమంది ప్రాణాలు కాపాడవచ్చని అన్నారు.
బండి సంజయ్ మాట్లాడుతూ ఒక దశలో తనకు హృదయ సమస్యలు తలెత్తినప్పుడు మెడికల్ ఆసుపత్రి వైద్యులే కాపాడారని గుర్తు చేసుకున్నారు.విపత్కర పరిస్థితులలో పునర్జన్మ ఇచ్చేది వైద్యులేనని, రోగులను మానవీయ కోణంలో చికిత్స అందించే వారి భవిష్యత్తును అందించడంలో వైద్యుల పాత్ర కీలకమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఎం.డి. మాట్లాడుతూ ప్రపంచ స్థాయి అత్యాధునిక సదుపాయాలతో అన్ని సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ల్యాబ్ రోబోటిక్, ఆర్థో రోబోటిక్ లాంటి సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన చికిత్సలు కూడా చేయనున్నట్లు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా 24వ బ్రాంచ్ కాగా తెలంగాణలో 8వ ఆసుపత్రిని సికింద్రాబాద్ లో నెలకొల్పినట్లు తెలిపారు. 350 పడకలతో పాటు అనుభవజ్ఞులైన వైద్యులచే వైద్య సేవలను అందించనున్నట్లు పేర్కొన్నారు. మెడికల్ ఆసుపత్రి అందించే మెరుగైన వైద్య సేవలను పొందాలని ప్రజలను కోరారు.
Sidhumaroju