Home South Zone Telangana రాజీవ్ గాంధీ నగర్ లో రేషన్ షాపు ఏర్పాటు చేయండి

రాజీవ్ గాంధీ నగర్ లో రేషన్ షాపు ఏర్పాటు చేయండి

0
9

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా:  వెంకటాపురం డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ బస్తీ వాసులు ప్రభుత్వ రేషన్ కోసం దూరంలోని రేషన్ షాపులకు వెళ్లాల్సి రావడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా వృద్ధులు, మహిళలు తమ వయస్సు మరియు ఆరోగ్య పరిస్థితుల వల్ల రేషన్ తీసుకునేందుకు చాలా కష్టాలు పడుతున్నారు.  ఈ నేపథ్యంలో బస్తీలోనే ఒక రేషన్ షాప్ ఏర్పాటు చేయాలని కోరుతూ బస్తీ ప్రజలు ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి వినతిపత్రాన్ని అందజేశారు.

అందుకుగాను ఎమ్మెల్యే  జిల్లా పౌరసరఫరాల అధికారితో మాట్లాడి సబ్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేయాలని తెలిపారు
ఈ కార్యక్రమంలో నాయకులు సబితా అనిల్ కిషోర్, సయ్యద్ మొసిన్, ఖలీల్, తాజుద్దీన్, రేహమత్ ఖాన్, ఆరిఫ్, అరుణ్,తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS