హైదరాబాద్: వారాసిగూడ శ్రీదేవి నర్సింగ్ హోమ్ ,గుడ్ విల్ కేఫ్ దగ్గర చెరువును తలిపిస్తున్న రోడ్లు.
తెలంగాణలో దంచి కొడుతున్న వర్షం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. పట్టణాల్లో రహదారులు నీటమునిగి ట్రాఫిక్ స్తంభించగా, గ్రామాల్లో పంట పొలాలు ముంపుకు గురవుతున్నాయి.
మొక్కజొన్న, వరి, పత్తి పంటలు దెబ్బతింటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇళ్లలో నీరు చేరి, విద్యుత్ అంతరాయం వల్ల ప్రజల జీవితం కష్టాల్లో పడింది.
ప్రభుత్వం సహాయక చర్యలు ప్రారంభించినప్పటికీ, వరుణుడి ఆగ్రహం కొనసాగుతుండటంతో భయాందోళనలు పెరుగుతున్నాయి