మిర్యాలగూడ ఎమ్మెల్యే తనయుడి రిసెప్షన్‌ను రద్దు చేస్తూ విశేష నిర్ణయం తీసుకున్నారు.
రిసెప్షన్ కోసం ఖర్చు చేయాల్సిన నిధులను రైతుల సహాయార్థం వినియోగించాలని నిర్ణయించారు.
ఆ నిధులతో యూరియా కొనుగోలు చేసి స్థానిక రైతులకు అందజేయనున్నట్లు తెలిపారు.
ఈ నిర్ణయాన్ని రైతులు అభినందిస్తూ, తమకు అండగా నిలిచిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.