మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్‌లోని లయోలా డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో మహిళా సాధికారతకు తోడ్పడే లక్ష్యంతో ఏర్పాటు చేసిన “Millet Festival for Women Empowerment” అనే ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖా మంత్రివర్యులు శ్రీమతి సీతక్క , మల్కాజ్‌గిరి శాసనసభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి , న్యూట్రి హబ్ – ఐకార్-ఐఐఎంఆర్ సీఈఓ మరియు డైరెక్టర్ డా. జాన్సన్ స్టాండ్లీ గారు ముఖ్య అతిథులుగా హాజరై, తమ సందేశాలతో కార్యక్రమానికి విశేషంగా మేళవించారు.
ఈ సందర్భంగా, మిల్లెట్ల పోషక విలువలపై అవగాహన పెంపుదల, ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతపై ప్రత్యేకంగా చర్చించబడింది. మిల్లెట్ ప్రదర్శన స్టాల్స్, అవగాహన సెషన్లు, మరియు మహిళా ఔత్సాహికుల అభివృద్ధిపై దృష్టి సారించిన ఈ వేడుక, విద్యార్థులు మరియు స్థానికుల నుండి విశేష స్పందన పొందింది.
కార్యక్రమంలో లయోలా కాలేజ్ కరస్పాండెంట్ శ్రీ ఫ్రాన్సిస్ జేవియర్, వైస్ చైర్మన్ ఫాదర్ అమర్ రావు, ప్రిన్సిపల్ ఫాదర్ డాక్టర్ ఎన్.బి.బాబు, నిర్వాహకులు డాక్టర్ భవాని, అలాగే కాలేజ్ సిబ్బంది, విద్యార్థులు, మిల్లెట్ స్టాల్స్ నిర్వాహకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
#Sidhumaroju