Home South Zone Telangana భాగ్యనగరంలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి |

భాగ్యనగరంలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి |

0
0

Hyderabad Rain Alert-హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షం ఉదృతికి పార్క్ చేసిన వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి.
ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, బి.ఎన్.రెడ్డి నగర్, నాగోల్ ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపించాయి. సాయి నగర్ కాలనీలో వీధుల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో పార్క్ చేసిన బైకులు కొట్టుకుపోవడం చూసి ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. ఎంతో కష్టపడి కొన్న వాహనాలు నీటిలో కొట్టుకుపోవడంతో కన్నీరు మున్నీరయ్యారు.
మన్సూరాబాద్‌లో వీకర్ సెక్షన్ కాలనీ ప్రజలు ఇంకా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రి కురిసిన వర్షానికి ఇళ్లలోకే వరద నీరు చేరడంతో రాత్రంతా నిద్ర లేక జాగారం చేశారు.
BY Bharat Aawaz

NO COMMENTS