Saturday, September 20, 2025
spot_img
HomeSouth ZoneTelanganaరైలు ఢీకొని ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు |

రైలు ఢీకొని ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు |

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:  బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు దాటుతున్న క్రమంలో ముగ్గురు యువకులను రైలు ఢీకొట్టింది.బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ వద్ద తెల్లవారుజామున ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందగా మరొకరికి గాయాలు అయ్యాయి.మృతులు కార్ఖానా, మచ్చ బొల్లారం వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురు స్నేహితులేనని ఉదయాన్నే రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. యువకుల మృతితో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
Sidhumaroju

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments