వైసిపి మైనార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సయ్యద్ గౌస్ మోహిద్దీన్,
మార్కాపురం….
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పి పి పి విధానంతో వైసిపి ప్రభుత్వ హయాంలో మంజూరు అయి నిర్మాణం లో ఉన్న మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి నిరసనగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి అన్నా వెంకట రాంబాబు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై మండే ఎండను సైతం లెక్కచేయకుండా విజయవంతం చేసిన ప్రతి ఒక్క నాయకుడికి,
కార్యకర్తలకు,అభిమానులకు కృతజ్ఞతలని వైసిపి మైనార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ గౌస్ మోహిద్దీన్ శనివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు..ఈ సందర్భంగా వైసీపీ నేత సయ్యద్ గౌస్ మోహిద్దీన్ మాట్లాడుతూ పేద ప్రజలకు ఉచిత ఆరోగ్య సేవలు అందాలనే లక్ష్యంతో నిరసన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి , జిల్లా జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ , మార్కాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే & నెల్లూరు పార్లమెంట్ పరిశీలకులు జంకె వెంకట్ రెడ్డి , ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ , గిద్దలూరు నియోజకవర్గం ఇంచార్జ్ కెపి నాగార్జున్ రెడ్డి , ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవి , కనిగిరి నియోజకవర్గ ఇంచార్జ్ దద్దాల నారాయణ , హాజరై వైసీపీ క్యాడర్ లో నూతన ఉత్తేజాన్ని నింపారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అన్నా రాంబాబు , జంకి వెంకట్ రెడ్డి , బూచేపల్లి వెంకాయమ్మ , మండుటెండలను సైతం లెక్కచేయకుండా తమ వయసును కూడా మరిచి యువకులతో ఉత్సాహంగా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం ప్రజల పట్ల వారికున్న నిబద్ధతకు నిదర్శనం అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకొని ప్రజలను మభ్య పెట్టాలని చూస్తే ఉపేక్షించేది లేదని, పేద ప్రజల పట్ల అండగా ఉంటామని తెలిపారు. జిల్లా నలుమూలల నుండి హాజరైన ప్రతి కార్యకర్తకు నాయకులకు పేరుపేరునా ధన్యవాదాలు అని తెలిపారు….