Monday, September 22, 2025
spot_img
HomeSouth ZoneTelanganaభారీ వర్షాల వల్ల ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించిన బిఆర్ఎస్ మాజీ మంత్రులు |

భారీ వర్షాల వల్ల ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించిన బిఆర్ఎస్ మాజీ మంత్రులు |

సికింద్రాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ముంపుకు గురైన రాంగోపాల్ పేట్ లోని పలు ప్రాంతాలలో బిఆర్ఎస్ మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధితులకు నిత్యవసర సరుకులను అందజేశారు.వరద బాధితులకు సహాయం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీష్ రావు ఆరోపించారు.

తలసాని శ్రీనివాస్ యాదవ్ తన సొంతంగా పేద ప్రజలకు వరద బాధితులకు సహాయం చేయడం గొప్ప విషయమని ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకోవాలని అన్నారు. వరదల మూలంగా ప్రజలు గల్లంతైన పరిస్థితి ఏర్పడడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని అన్నారు.మున్సిపల్ శాఖ తన వద్దే పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన సౌలభ్యం విషయంలో దృష్టి సారించలేకపోతున్నారని అన్నారు.
ముఖ్యమంత్రి వైఖరి అతని హోదాను తగ్గించే విధంగా ఉందని ఆక్షేపించారు.

ఇప్పటికైనా వరద మంపు ప్రాంతాలలో బాధితులకు ఆర్థిక సహాయము నిత్యావసర సరుకులను పంపిణీ చేసి,నాలాల పూడిక తీత పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల విషయమై స్పందించిన హరీష్ రావు.  బహిరంగంగా పార్టీ కండువా మార్చుకుని పార్టీ మారలేదని చెప్పడం సిగ్గుచేటన్నారు.బతుకమ్మ పండుగ నేపథ్యంలో ప్రభుత్వం నిధులు విడుదల చేసి మౌలిక వసతులు కల్పించాలని కోరారు.  గ్రామ పంచాయతీలకు  నిధులు లేక గ్రామాలలో పాలన కుంటుపడిందని తెలిపారు.

Sidhumaroju

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments