భారత దేశం క్వాంటం కంప్యూటింగ్ రంగంలో గణనీయమైన పురోగతులు సాధిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో “క్వాంటం వ్యాలీ”ని ఏర్పాటు చేయాలని ప్రణాళిక చేయడం విశేషం.ఈ ప్రాజెక్ట్ ద్వారా పరిశోధన, అభివృద్ధి, నూతన ఆవిష్కరణలకు వేగం లభిస్తుంది.
క్వాంటం టెక్నాలజీని అభివృద్ధి చేసి, విద్యా, పరిశ్రమ, పరిశోధన రంగాల్లో భారత్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికి ఇది దోహదం చేస్తుంది. రాష్ట్రంలో నూతన నైపుణ్యాలను పెంపొందించడం, ఉద్యోగ అవకాశాలను సృష్టించడం లక్ష్యం.