మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి , మల్కాజ్గిరి నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలలో ఒకటైన రైల్వే సంబంధిత సమస్యల పరిష్కారం కోసం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ ని, హైదరాబాద్ డిఆర్ఎం శ్రీ సంతోష్ కుమార్ వర్మ ని, సికింద్రాబాద్ డిఆర్ఎం శ్రీ గోపాలకృష్ణన్ ని మర్యాదపూర్వకంగా కలిసారు.
ఈ సందర్భంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలలో నెలకొన్న రైల్వే RUB ల నిర్మాణం మరియు డ్రైనేజ్ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. అధికారులు సమస్యలను సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
ప్రధాన అంశాలు:
1. వాజ్పాయి నగర్ RUB నిర్మాణానికి త్వరితగతిన చర్యలు
2. జనప్రియ అపార్ట్మెంట్స్ RUB అభివృద్ధి పనుల ప్రారంభం
3. బొల్లారం రైల్వే బజార్ కొత్తబస్తీ బజార్ ప్రాంతంలో డ్రైనేజ్ సమస్య
4. భుదేవి నగర్ సమీపంలో రైల్వే డ్రైనేజ్ సమస్య
5. మౌలాలి శ్రీనగర్ కాలనీ IALA పరిధిలో డ్రైనేజ్ సమస్య
6. ఆర్కే పురం ఫ్లై ఓవర్ నిర్మాణానికి డ్రాయింగ్స్ ఆమోదం కోసం విజ్ఞప్తి
7. భవానీనగర్ (141వ డివిజన్) లో డ్రైనేజ్ సమస్య పరిష్కారం
ఈ సమావేశంలో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి , బిఆర్ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, జీకే హనుమంతరావు, అమీన్ఉద్దీన్, మేకల రాము యాదవ్, చిన్న యాదవ్, భాగ్యానందరావు, వంశీ ముదిరాజ్, రాజశేఖర్ రెడ్డి, ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.
#Sidhumaroju