తెలంగాణ రాష్ట్రం పేదరిక నిర్మూలనలో అద్భుతమైన పురోగతిని సాధించింది. నితి ఆయోగ్ విడుదల చేసిన SDG సూచీలో 2023-24 కి “పేదరికం లేకుండా” లక్ష్యంలో 91 పాయింట్లు సాధించి, దేశంలో 2వ స్థానాన్ని దక్కించుకుంది.
2020-21లో 14వ స్థానంలో ఉన్న తెలంగాణ, కొన్ని సంవత్సరాల్లోనే గొప్ప ఎగబాకి, సంక్షేమ పథకాలు, ఆర్థిక వృద్ధి, సామాజిక భద్రతా చర్యలతో వెనుకబడిన వర్గాలను ముందుకు నడిపింది.
ఈ విజయంతో తెలంగాణ సమగ్ర అభివృద్ధి, సమానత్వం, సుస్థిర భవిష్యత్తు వైపు దూసుకెళ్తుందని స్పష్టం అవుతోంది.