సికింద్రాబాద్ : బన్సీలాల్ పేట్ లోని ఆ స్థలం కుర్మ సంఘానికి చెందిన స్మశాన వాటిక స్థలమేనని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. తమ స్మశానవాటిక స్థలంలో అక్రమంగా అనుమతులు తీసుకొని బహులంతస్తుల భవనం నిర్మాణము చేస్తున్నారని కుర్మసంఘం నాయకులు వివిధ రకాలుగా నిరసనలు చేస్తున్నారు.
రెండు రోజుల క్రితం వీరికి అండగా మార్వాడీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఆందోళన కారులు సైతం వీరికి అండగా నిలవడం, వారితో కలిసి పెద్దఎత్తున ధర్నా చేశారు. ఈ నేపద్యంలో ఈ రోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ రెవిన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ స్థలం కచ్చితంగా కుర్మ సంఘవారికి చెందిన స్మశాన వాటిక అని తెలిపారు. ఈ స్థలం తమ స్వాదినంలోకి తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించినట్లు పేర్కొన్నారు.
కోర్టులో వివాదం ముగిసిన వెంటనే స్మశాన వాటికకు కావలసిన సౌకర్యాలన్ని కల్పించి అప్పగిస్తానని వెల్లడించారు. తన పేరును దుర్వినియోగం చేసి అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని కబ్జాదారులను హెచ్చరించారు.
#Sidhumaroju