తెలంగాణలో వర్షాలు మరింత ఉధృతం అయ్యాయి. ముఖ్యంగా ములుగు జిల్లాలో ఎటురునాగారం వద్ద 66.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు భారీ నుండి అతి భారీ వర్షాల అవకాశం ఉందని ఓరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
పిడుగులు, గాలివానలు తాకే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు, ప్రయాణికులు, గ్రామీణ ప్రాంత ప్రజలు వాతావరణ సూచనలను గమనించి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.