తెలంగాణ ఆరోగ్య శాఖ రాష్ట్రవ్యాప్తంగా డయాలసిస్ సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి కీలక నిర్ణయం తీసుకుంది.
ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాల మేరకు ప్రతి 20–25 కిలోమీటర్లకు ఒక ప్రభుత్వ డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రోగుల సంఖ్య, జనాభా సాంద్రత, అవసరమైన యంత్రాల పెంపు వంటి అంశాలను పరిగణలోకి తీసుకోనున్నారు.
ఈ చర్యతో కిడ్నీ వ్యాధిగ్రస్తులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, సమీపంలోనే సమయానికి చికిత్స పొందే అవకాశం లభించనుంది. ఇది గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రత్యేకంగా ఉపశమనం కలిగించే అవకాశం ఉంది.