కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ బీజేపీ సిద్ధమైంది.
జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ప్రచారం ద్వారా, సవరించిన జీఎస్టీ రేట్ల వల్ల సామాన్య ప్రజలకు, వ్యాపారులకు కలిగే ప్రయోజనాలను వివరించనున్నారు.
ఆహార పదార్థాలు, గృహోపకరణాలు, మందులు వంటి వాటిపై పన్నులు తగ్గిన విషయాన్ని ప్రజలకు తెలియజేయడమే ఈ ప్రచార లక్ష్యం. ఇది మధ్యతరగతి, నిరుపేద వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని పార్టీ నాయకులు తెలిపారు.