Tuesday, September 30, 2025
spot_img
HomeSouth ZoneTelanganaతెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు

తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు

హైదరాబాద్‌: తెలంగాణలో పలు ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం కొత్త నియామకాలు చేసింది. ముఖ్యమైన మార్పులు ఇలా ఉన్నాయి:

 

రవి గుప్తా (1990) – హోమ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నుంచి సెంటర్ ఫర్ గుడ్ గవర్నన్స్ డీజీగా మార్పు.

 

సి.వి. ఆనంద్ (1991) – హైదరాబాద్ పోలీస్ కమీషనర్ పదవి నుంచి హోమ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ.

 

శిఖా గొయల్ (1994) – సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ నుంచి విజిలెన్స్, ఎన్ఫోర్స్‌మెంట్ డీజీగా.

 

స్వాతి లక్రా (1995) – హోమ్ గ్రౌండ్ ఏడీజీపీ నుంచి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీ (ఫుల్ అదనపు బాధ్యత).

 

ఎం. మహేష్ భగవత్ (1995) – లా & ఆర్డర్ ఏడీజీపీగా ఉన్న ఆయనకు ఏడీజీపీ (పర్సనల్) అదనపు బాధ్యతలు.

 

చారు సిన్హా (1996) – సీఐడి అదనపు డీజీపీ నుంచి ఏసీబీ డీజీగా బదిలీ.

 

డాక్టర్ అనిల్ కుమార్ (1996) – గ్రేహౌండ్స్–అక్టోపస్ ఏడీజీపీ (ఆపరేషన్స్)గా కొనసాగింపు.

 

వి.సి. సజ్జనార్ (1996) – ఆర్టీసీ ఎండి నుంచి హైదరాబాద్ పోలీస్ కమీషనర్‌గా నియామకం.

 

విజయ్ కుమార్ (1997) – ఇంటెలిజెన్స్ ఏడీజీపీగా బదిలీ.

 

వై. నాగిరెడ్డి (1997) – డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ సర్వీసెస్ డీజీ నుంచి ఆర్టీసీ ఎండి.

 

దేవేంద్ర సింగ్ చాహన్ (1997) – సివిల్ సప్లయిస్ ఎండి నుంచి మల్టీజోన్–II ఏడీజీపీగా.

 

విక్రమ్ సింగ్ మాన్ (1998) – లా అండ్ ఆర్డర్ అడిషనల్ కమీషనర్ నుంచి డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ సర్వీసెస్ డీజీ.

 

ఎం. స్టీఫెన్ రవీంద్ర (1999) – సివిల్ సప్లయిస్ కమిషనర్‌గా నియామకం.

 

ఎం. శ్రీనివాసులు (2006) – సీఐడి ఐజీ నుంచి హైదరాబాద్ అడిషనల్ కమీషనర్ (క్రైమ్స్).

 

తప్సీర్ ఇక్బాల్ (2008) – జోన్–VI డీఐజీ నుంచి లా అండ్ ఆర్డర్ జాయింట్ కమీషనర్.

 

ఎస్‌.ఎం. విజయ్ కుమార్ (2012) – హైద‌రాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ నుంచి సిద్దిపేట కమీషనర్.

 

సింధు శర్మ (2014) – ఇంటెలిజెన్స్ ఎస్పీ నుంచి ఏసీబీ జాయింట్ డైరెక్టర్.

 

డాక్టర్ జి. వినీత్ (2017) – మాదాపూర్ డీసీపీ నుంచి నారాయణపేట ఎస్పీ.

 

డాక్టర్ బి. అనురాధ (2017) – ఎల్.బి. నగర్ డీసీపీగా రాచకొండలో కొనసాగింపు.

 

చ. ప్రవీణ్ కుమార్ (2017) – ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా నియామకం.

 

యోగేష్ గౌతమ్ (2017) – నారాయణపేట ఎస్పీ నుంచి రాజేంద్రనగర్ డీసీపీ (సైబరాబాద్).

 

సి.హెచ్. శ్రీనివాస్ (2018) – హైద‌రాబాద్ వెస్ట్ జోన్ డీసీపీగా కొనసాగింపు.

 

రితి రాజ్ (2018) – మాదాపూర్ డీసీపీ (సైబరాబాద్)గా కొనసాగింపు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments