Home South Zone Andhra Pradesh ఎంఎల్ఏ బొగ్గుల దస్తగిరి స్మార్ట్ కార్డులను పంపిణీ

ఎంఎల్ఏ బొగ్గుల దస్తగిరి స్మార్ట్ కార్డులను పంపిణీ

0
28

కర్నూలు రూరల్ మండలం పసుపుల గ్రామంలో రేషన్ కార్డుదారులకు కొడుమూరు నియోజవర్గ ఎంఎల్ఏ బొగ్గుల దస్తగిరి స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు ఈ సందర్బంగా ఎంఎల్ఏ మాట్లాడుతూ రేషన్ పంపిణీలో అనేక మార్పులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు . ప్రభుత్వం అందులో భాగంగా స్మార్ట్ కార్డులను అందజేస్తుందన్నారు ఇప్పటి వరకు వేలి ముద్రలు పడక రేషన్ సరుకులు తీసుకోవడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే వారని, ఇప్పుడు వేలి ముద్రలు పడకపోయిన స్మార్ట్ కార్డును స్కాన్ చేసి సరుకులు తీసుకోవచన్నారు.. ఏటీఏం కార్డు తరహాలో ఉండే ఈ స్మార్ట్ కార్డులో కార్డు దారుడి ఫోటోతో పాటు కుటుంబ సభ్యులు , ప్రభుత్వ గుర్తింపు ముద్ర మాత్రమే ఉంటుందని తెలిపారు…ఈ కార్యక్రమంలో MRO రమేష్ ,సచివాలయం సిబ్బంది, డీలర్లు, కూటమి నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు…

NO COMMENTS