తెలంగాణ ప్రభుత్వం సోషల్ మీడియా వేదికలపై తరచుగా వివాదాస్పదంగా వ్యవహరించే వ్యక్తులపై “హిస్టరీ షీట్లు” తెరుస్తున్నట్లు సమాచారం. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆదేశాల ప్రకారం, అలాంటి వ్యక్తులను సైబర్ నేరస్తుల సరసన చేర్చి, నిఘా పెట్టే చర్యలు చేపడుతోంది.
ఈ చర్యలు పాతబస్తీ ప్రాంతాల్లో ఇప్పటికే అమలులో ఉన్నట్లు తెలుస్తోంది. హిస్టరీ షీట్లు సాధారణంగా తీవ్రమైన నేరాలపై మాత్రమే తెరుస్తారు, కానీ ఇప్పుడు సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా కూడా ఈ చర్యలు తీసుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇది ప్రజల స్వేచ్ఛా హక్కులను హరించడమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ ప్రతిపక్షాలు దీన్ని ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా అభివర్ణిస్తున్నాయి