సెప్టెంబర్ 2025లో తెలంగాణ రాష్ట్రం జీఎస్టీ వసూళ్లలో –5% తగ్గుదలతో దేశంలోనే అట్టడుగు స్థానంలో నిలిచింది. గత ఏడాది ఇదే నెలలో 5,227 కోట్ల రూపాయల వసూళ్లు నమోదవగా, ఈ ఏడాది 4,998 కోట్లకు పడిపోయాయి.
హైదరాబాద్ వంటి అతిపెద్ద నగరం ఉన్నా కూడా వసూళ్లు తగ్గడం ఆర్థికంగా ఆందోళన కలిగిస్తోంది. గత పాలనలో 33% వృద్ధి నమోదు చేసిన తెలంగాణ, ఇప్పుడు మైనస్‌లోకి వెళ్లడం ఆర్థిక విధ్వంసానికి సంకేతంగా భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ తీవ్ర విమర్శలు చేస్తోంది.
వ్యవసాయం నుండి ఐటీ వరకు అన్ని రంగాల్లో మందగమనం కనిపిస్తోంది. ఇది రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.