ఆటో డ్రైవర్లకు అండగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం, ఏడాదికి రూ.15వేల ఆర్థిక సహాయం
నెరవేరిన మరో హామీ.. ఆటో డ్రైవర్ల సేవలో
ఆత్మకూరు పట్టంలోని నంద్యాల టర్నింగ్ నుంచి స్వయంగా ఆటో నడిపి ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి గారు.
అసంఘటిత రంగంలో ఉన్న ఆటో కార్మికుల కోసం కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారి కుటుంబాల్లో ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది.
వైసీపీ హయాంలో రూ 10వేలు ఇచ్చి.. ఫైన్ ల పేరుతో రూ.30వేలు నొక్కారు..
గుంతల రోడ్లు, పోలీసుల కేసులు, భారీగా డీజిల్ ధరలతో డైవర్లు అనేక ఇబ్బందులు పడ్డారు..
నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రీన్ టాక్స్ లు, రోడ్డు టాక్స్ ల భయం లేదు.
రాష్ట్ర వ్యాప్తంగా రూ.1400 కోట్లతో రోడ్లను బాగుచేశాం..
నాడు జగన్ ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.10 వేల చొప్పున రూ.260 కోట్లు ఇస్తే.. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏడాదికి రూ.15 వేల చొప్పున రాష్ట్రంలోని 2.90 లక్షల మంది ఆటో డ్రైవర్లకు రూ.435 కోట్ల గౌరవ భృతిని అందజేస్తుంది.
15 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసి సూపర్ హిట్ చేయడంతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు.
నేడు కూటమి ప్రభుత్వంలో ప్రతి ఇళ్ళు, ప్రతి కుటుంబం లబ్ధి పొందింది.
స్ర్తీ శక్తి పథకంతో రెండు నెలల్లోనే 7 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాలు చేసి లబ్ది పొందారు.
రాబోయే రోజుల్లో మరింత సంక్షేమం, అభివృద్ధిని రాష్ట్ర ప్రజలకు అందేలా సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పని చేస్తుంది.
ఆటో డ్రైవర్లక సేవలో పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ బు
డ్డా రాజశేఖర రెడ్డి గారు.