ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా సంస్థ ఎలీ లిల్లీ హైదరాబాద్‌లో కొత్త కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ మరియు క్వాలిటీ హబ్ నిర్మాణానికి $1 బిలియన్ (సుమారు ₹8,300 కోట్ల) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది.
ఈ కేంద్రం రంగారెడ్డి జిల్లా పరిధిలో అభివృద్ధి చేయనున్నారు. ఇది స్థానికంగా ఉద్యోగ అవకాశాలను పెంచడంతో పాటు, తెలంగాణ రాష్ట్రాన్ని ఫార్మా రంగంలో అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా కీలకంగా నిలవనుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఈ పెట్టుబడిని స్వాగతిస్తూ, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సిద్ధంగా ఉందని తెలిపింది. ఇది హైదరాబాద్‌ను ఫార్మా హబ్‌గా మరింత బలపరచనుంది.