మండల కో ఆప్షన్ సభ్యులు దౌల సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఈ ఓ ఆర్ డి మధులతకు పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని అర్జీని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వ హయాంలో గడప గడపకు మన ప్రభుత్వం కింద ఒక్కో సచివాలయానికి అభివృద్ధి పనులు కొరకు ప్రభుత్వంరూ.20 లక్షలలు మంజూరు చేసిందన్నారు. స్థానిక ఎస్సీ కాలనీలో అభివృద్ధి పనులు చేసేందుకు అప్పటి ఎంపీడీవో సమక్షంలో పంచాయతీరాజ్ శాఖ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ లు పనుల అగ్రిమెంట్ను తనతో చేయించుకోవడంతో రూ 20 లక్షలు అప్పులు తెచ్చి మూడు కిలోమీటర్ల మేరకు కొత్త తాగునీటికి పైప్లైన్, 12కి పైగా కాలనీలో మినీ ట్యాంకులు, బోర్లకు విద్యుత్ మోటర్లు వంటి వాటి ఏర్పాటుకు ఖర్చు చేయడం జరిగిందన్నారు. కాలనీలో పనులు పూర్తయి మూడేళ్లు అవుతున్న ఇప్పటివరకు కేవలం అధికారులు నాలుగు లక్షల వరకు బిల్లులు మంజూరు చేయగా మిగిలిన రూ 16 లక్షల బిల్లులు చేయకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారన్నారు. పనులకు సంబంధించిన ఏం బుక్, వర్క్ అగ్రిమెంట్లు, పనికి సంబంధించిన ఎస్టిమేషన్ కాపీలను అందించకుండా కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎంపీడీవో స్పందించి తనకు రావాల్సిన పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని ఆయన కోరారు. .