మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ సర్కిల్ బిజెపి నాయకులు అల్వాల్ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా నిరసన దీక్ష చేపట్టారు సర్వేనెంబర్ 573, 574 575 లో ఇల్లు నిర్మాణం లేకుండానే 80 ప్లాట్లకు ఇంటి నెంబర్లు కేటాయించడం వల్ల అధికార దుర్వినియోగం చేసిన మున్సిపల్ అధికారులను తక్షణమే తొలగించాలని పెద్ద ఎత్తున నిరసన తెలిపారు అంతకుముందు ప్రజావాణిలో భాగంగా సర్కిల్లో గల పార్కులను అభివృద్ధి పరచాలని, ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేయాలని వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో చింతల మాణిక్యరెడ్డి మేడ్చల్ జిల్లా అర్బన్ సెక్రటరీ, మల్కాజ్గిరి కో కన్వీనర్ మల్లికార్జున్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు అజయ్ రెడ్డి, కార్తీక్ గౌడ్ , శ్రీధర్ రెడ్డి, లక్ష్మణ్, మరియు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
Sidhumaroju