ప్రకాశం జిల్లా:ప్రకాశం జిల్లా కనిగిరిలో ట్రేడింగ్ యాప్ పేరుతో జరిగిన మోసం కలకలం రేపుతోంది. స్థానిక వ్యాపారిని లక్ష్యంగా చేసుకున్న ఓ మహిళ, ఆన్లైన్ ట్రేడింగ్లో లాభాలు వస్తాయని నమ్మబలికి, రూ.1.16 కోట్లు తీసుకెళ్లినట్లు సమాచారం.
బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డిజిటల్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
కనిగిరి ప్రాంతంలో ఈ ఘటనపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఆర్థిక మోసాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.