భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన అంతర్జాతీయ కెరీర్‌లో రెండు చారిత్రక మైలురాళ్లకు చేరువవుతున్నాడు. ఇప్పటి వరకు 499 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రోహిత్, మరో మ్యాచ్‌తో 500వ మ్యాచ్ ఘనతను సాధించబోతున్నాడు.
అలాగే 49 సెంచరీలు చేసిన ఆయన, మరో శతకంతో 50 సెంచరీల మైలురాళ్లను చేరుకోనున్నాడు. ఈ రెండు ఘనతలు భారత క్రికెట్ చరిత్రలో అరుదైనవిగా నిలుస్తాయి.
హైదరాబాద్ జిల్లాలోని క్రికెట్ అభిమానులు ఈ ఘనతల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో సందడి కొనసాగుతోంది.