హైదరాబాద్ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం BC కోటాను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.
ఈ కోటా రాజ్యాంగబద్ధంగా ఉందని, ప్రజాప్రతినిధులుగా వెనుకబడిన తరగతులకు ప్రాధాన్యం ఇవ్వడం సముచితమని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ తీర్పుతో రాష్ట్రంలో BC వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం మరింత బలపడనుంది.
హైదరాబాద్ జిల్లాలో ఈ తీర్పు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. పిటిషన్ కొట్టివేతతో ప్రభుత్వానికి ఊరట కలిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. BC సంఘాలు ఈ తీర్పును స్వాగతిస్తున్నాయి.