విజయనగరం జిల్లా: విజయనగరం జిల్లాలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ప్రారంభమైంది.
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవమైన సిరుల తల్లి ఉత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. “అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా” అని ఆయన పేర్కొన్నారు. ఈ
ఉత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం నగరంలో భక్తుల సందడి నెలకొంది. సాంప్రదాయ ఉత్సవాల్లో ఒకటైన ఈ సిరిమానోత్సవం ఉత్తరాంధ్ర సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తోంది.