హైదరాబాద్ నగరంలో మంగళవారం సాయంత్రం ఉరుములతో కూడిన చినుకులు విస్తృతంగా కురుస్తున్నాయి.
ఖైరతాబాద్, అమీర్‌పేట్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ప్రారంభమైన వర్షం, నాంపల్లి, మసాబ్‌ట్యాంక్, చార్మినార్, అసిఫ్‌నగర్, రాజేంద్రనగర్, బహదూర్‌పురా, ట్యాంక్‌బండ్, ఎల్బీనగర్, మలక్‌పేట్, సరోర్నగర్, సైదాబాద్, హయత్‌నగర్ వరకు విస్తరిస్తోంది. వర్షం మరో గంటపాటు కొనసాగే అవకాశం ఉంది.
ట్రాఫిక్‌కు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే నీటి నిల్వలు, ట్రాఫిక్ జామ్‌లు కనిపిస్తున్నాయి.