హైదరాబాద్ జిల్లా:సెప్టెంబర్ నెలలో దేశవ్యాప్తంగా వాహనాల అమ్మకాలు రికార్డు స్థాయికి చేరాయి. మొత్తం 18,27,337 యూనిట్లు విక్రయమవడం ద్వారా ఆటోమొబైల్ రంగం పండుగ సీజన్‌కు ముందు ఊపందుకుంది.
నవరాత్రి, దసరా పండుగల నేపథ్యంలో వినియోగదారుల కొనుగోలు ఆసక్తి పెరగడం, కొత్త మోడళ్ల విడుదల, ఆఫర్లు వంటి అంశాలు అమ్మకాలపై ప్రభావం చూపాయి. హైదరాబాద్ జిల్లాలో కూడా వాహన డీలర్ల వద్ద కొనుగోలు వాతావరణం కనిపించింది.
ఈ గణాంకాలు పరిశ్రమకు ధైర్యాన్ని కలిగిస్తున్నాయి. పండుగ సీజన్‌లో మరింత వృద్ధి సాధించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.